Home  »  Featured Articles  »  ఈ హీరోని చూసి సాక్షాత్తు శ్రీరాముడే అన్నారు

Updated : Aug 13, 2026

 

తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో మహానుభావులు. అలాంటి వాళ్లలో ఒకరు  సి.హెచ్. నారాయణరావు.  సహజ నటనకి పెట్టింది పేరు. చలనచిత్ర రంగానికి పునాదులు పడుతున్న రోజుల్లో, తన అద్భుతమైన నటన, శోభాయమానమైన రూపంతో ప్రేక్షకుల హృదయాలని  కొల్లగొట్టిన మహానటుడు. సినిమా రంగంతో ఈ మాత్రం సంబంధం లేదు. కానీ దర్శకుడు ద్రోణంరాజు చిన కామేశ్వరావుని నారాయణరావు రూపం ఆకర్షించింది.  

దీంతో 1940 లో జీవన జ్యోతి తో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత  'చెంచులక్ష్మి' భక్త పోతన', 'రాధాకృష్ణ' వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా 1948లో విడుదలైన 'మనదేశం' సినిమాలో ఆయన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ చిత్రంతోనే ఎన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు వంటి దిగ్గజాలు వెండితెరకి పరిచయమవ్వగా నారాయణరావు హీరో. 1942 లో చేసిన భక్త పోతన మూవీలో శ్రీరామచంద్రుడుగా కనపడ్డారు. రాముడిగా  ఆయన రూపురేఖలు, ముఖంలో కనిపించే శాంతం, కళ్లలోని గాంభీర్యం చూసి అప్పటి ప్రేక్షకులు నారాయణరావు గారిని సాక్షాత్తు "శ్రీరాముడు" అని పిలుచుకునేవారు. ఆయన పోషించే క్యారక్టర్ లో కనిపించే దైవిక కళ, నటనలో ఉండే సహజత్వం ప్రజల మనసుల్లో ఆయన్ని రాముడిలా ప్రతిష్ఠించాయి.

Also read: వైరల్ గా మారిన న్యూస్: షూటింగ్ లేని టైంలో #ప్రభాస్ ఏం చేస్తాడో తెలుసా! 

కెరీర్ లో మొత్తం ముప్పై ఒక్క సినిమాల వరకు చేసిన నారాయణరావు 1953 లో 'మంజరి' అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం ఆర్థికంగా నారాయణరావు గారిని కోలుకోలేని దెబ్బ తీసింది. దీంతో తన సంపాదనలో చాలా భాగం కోల్పోవాల్సి వచ్చింది. అయినా సరే  తన క్రమశిక్షణని, నటన పట్ల ఉన్న అంకితభావాన్ని ఎప్పుడూ వీడలేదు.  పూర్తి పేరు చదలవాడ నారాయణరావు. స్వస్థలం మధుగిరి.  1913 సెప్టెంబర్ 13 డేట్ ఆఫ్ బర్త్. 1984 ఫిబ్రవరి 14 న పరమపదించారు.

Ch. Narayanarao, Sriramudu, Ntr






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.